యానిమల్ అనే టైటిల్ అందుకే పెట్టాము... సందీప్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అర్జున్ రెడ్డి ( Arjun Reddy ) సినిమా ద్వారా రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు సందీప్ రెడ్డి ( Sandeep Reddy ) వంగ.

ఈయన డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇలా తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు హిందీలో కబీర్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సందీప్ రెడ్డి అక్కడ కూడా మంచి సక్సెస్ కావడంతో ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పాగా వేశారు .ఈ క్రమంలోనే తాజాగా సందీప్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్( Animal ).సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

రణబీర్ కపూర్( Ranbir Kapoor ) రష్మిక ( Rashmika ) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఇలా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సందీప్ రెడ్డి అసలు ఈ సినిమాకు యానిమల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు.

ఈ టైటిల్ పెట్టడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అనే విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో రణబీర్ కపూర్ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని ఇదివరకే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమాకు అలాంటి పేరు పెట్టి ఉంటారని భావించారు.

సందీప్ రెడ్డి ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనే విషయం గురించి మాట్లాడుతూ.మనుషులకు ఐక్యూ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్‌లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించామని.ఐక్యూ అనేది లేకపోతే మనం కూడా యానిమల్ అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు.

యానిమల్‌కు ఐక్యూ ఉండదు.తన ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటుంది.

ఈ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉంటుంది కనుక ఈ సినిమాకు యానిమల్ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించి ఈ టైటిల్ ఎంపిక చేసుకున్నాను అంటూ సందీప్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు