సందీప్ కిషన్ త్రినాధ్ రావు నక్కిన కాంబోలో రావాల్సిన సినిమా వచ్చేది ఎప్పుడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు అందరిలో మంచి టాలెంటెడ్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటుడు సందీప్ కిషన్(Sandeep Kishan).

ఆయనకు సక్సెస్ లు రావడం లేదు కానీ సక్సెస్ లు వస్తే మాత్రం ఆయన ఇప్పటికే స్టార్ హీరో రేంజ్ లో ఉండేవాడు.

డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడూ అసక్తి చూపిస్తూ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక వీఐ ఆనంద్ డైరెక్షన్(Directed by VI Anand) లో చేసిన ఊరి పేరు భైరవకోన(Ooru peru Bhairavakona) సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక అందులో భాగంగానే ధమాకా(Dhamaka) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.అయితే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుడడం విశేషం.

అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సినిమా యూనిట్ గతంలో తెలియజేశారు.కానీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా? ఆగిపోయిందా? అనే విషయాలు కూడా ఎక్కడ బయటకు తెలియజేయడం లేదు.

Advertisement

మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ధోరణిలోనే కొంతమంది కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే అడుగుతున్నారు.ఇక ముఖ్యంగా సందీప్ కిషన్ లాంటి హీరో తెలుగు, తమిళ్ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఇలాంటి సందర్భంలో కమర్షియల్ సినిమాలను తొందరగా కంప్లీట్ చేసి ముందుకు సాగితే ఆయనకే మంచిదని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడం విశేషం.

మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేసుకొని, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిమీద మేకర్స్ స్పందిస్తే బాగుంటుందని పలువురు సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు