ఇకపై అలా పిలవడం మానుకోండి... ఫైర్ అయిన సంయుక్త మీనన్?

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ( Samyuktha Menon) తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఇలా ఇప్పటివరకు ఈమె తెలుగులో నాలుగు సినిమాలలో నటించగా నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

సాధారణంగా ఒక హీరోయిన్ వరుస సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకుంటే కనుక తనకి ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ అనే టాగ్ తగిలించి పిలుస్తుంటారు.అదే వరుసగా సినిమాలు కనుక ఫ్లాప్ అయితే తనని ఐరన్ లెగ్( Iron Leg ) అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే నటి సంయుక్త మీనన్ వరుస సినిమాలలో నటించి మంచి హిట్ అందుకోవడంతో తనను గోల్డెన్ లెగ్(Golden Leg) అంటూ పిలుస్తున్నారు.ఈ క్రమంలోనే విరూపాక్ష సినిమా ( Virupaksha Movie ) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమెను ప్రశ్నిస్తూ ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్ కాన్సెప్ట్ గురించి అడగడంతో ఈమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అలాగే తనని గోల్డెన్ లెగ్ అని పిలవడం మానుకోవాలని సూచించారు.

ఒక హీరోయిన్ ను ఇలా ఐరన్ లెగ్ లేదా గోల్డెన్ లెగ్ అని పిలవడంలో అర్థం లేదని తెలిపారు.

Advertisement

ఒక సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఆ సినిమా ఫలితం అందుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది.అదృష్టం ఉంటేనే సక్సెస్ వస్తుంది అనడం సరైంది కాదని ఈమె తెలియజేశారు.మనం ఒక సినిమా చేసేటప్పుడు సరైన స్క్రిప్ట్ ఎంపిక చేసుకొని అద్భుతమైన నటనను కనపర్చినప్పుడే ఎవరికైనా విజయం వరిస్తుందని తెలిపారు.

ఇకనైనా ఈ ఐరన్ లెగ్ గోల్డెన్ లెగ్( Golden leg )అనే పాత కాన్సెప్ట్ పక్కన పెట్టండి అంటూ ఈమె ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈమె విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు