పవన్ చెల్లి అంటే ఫ్యూచర్లో కష్టమే..!

మలయాళ భామ సంయుక్త మీనన్ తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తుంది.పవన్ సినిమా భీమ్లా నాయక్( Bheemla Nayak ) లో డ్యానియల్ శేఖర్ భార్య గా నటించింది అమ్మడు.

ఆ సినిమాలో రానాకి జోడీగా నటించిన సంయుక్త ( Samyuktha Menon )సినిమాలో పవన్ కి చెల్లెలిగా కనిపించింది.అయితే ఆ సినిమా తర్వాత అందరు తనని పవన్ కళ్యాణ్ చెల్లిగా గుర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది.రీసెంట్ గా విరూపాక్ష ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని చెప్పింది సంయుక్త.

భీమ్లా నాయక్ సినిమాలో ఆమె చెల్లి పాత్ర చేసింది.సో అలా చూస్తే చెల్లిగా చేసిన సం యుక్త హీరోయిన్ గా పవన్ సినిమా చేసే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.

సంయుక్త కూడా అలా అని ఫిక్స్ అయ్యింది కాబట్టే పవన్ చెల్లిగా తనని గుర్తిస్తున్నారని చెప్పింది.ఇక ఆ సినిమా షూటింగ్ కోసం ముందే తెలుగు ట్యూటర్ ని పెట్టుకుని తెలుగు నేర్చుకున్నదట.అంత డెడికేషన్ ఉంది కాబట్టే అమ్మడికి తెలుగులో వరుస హిట్లు పడుతున్నాయి.

Advertisement

లేటెస్ట్ గా వచ్చిన విరూపాక్ష( Virupaksha ) హిట్ తో సంయుక్త క్రేజ్ డబుల్ అయ్యింది.అందుకే అమ్మడితో సినిమా కోసం దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు