లిటిల్ ఏంజెల్ కి జన్మనిచ్చిన సమీరా

టాలీవుడ్ లో ఒకటి రెండు చిత్రాలతో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమీరా రెడ్డి.

గత కొద్ది రోజులుగా తన 9 నెలల గర్భం తో అండర్ వాటర్ లో ఫోటో షూట్ నిర్వహించిన సమీరా ఇప్పుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది అంటూ చిన్నారి చేతిని పట్టుకొన్న ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

మీ ప్రేమకి,ఆశీర్వాదాలకి ధన్యవాదాలు అని తెలుపుతూ సమీరా పోస్ట్ చేయడం తో ఈ విషయం అర్ధం అయ్యింది.బాలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటించి తెలుగులో జూనియర్ ఎన్ఠీఆర్ హీరో గా తెరకెక్కిన అశోక్,చిరంజీవి లతో కలిసి నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమీరా.అయితే 2014 లో అక్షయ్ వార్డె అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సమీరా సినిమాలకి దూరమైన సంగతి తెలిసిందే.

ప్ర‌స్తుతం వీరికి హ‌న్స్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉండగా, రీసెంట్‌గా పండంటి ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చినట్లు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.మా లిటిల్ ఏంజెల్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.మీ ప్రేమ‌కి, ఆశీర్వాదాల‌కి ధ‌న్య‌వాదాలు అని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది.

Advertisement

స‌మీరాకి అభిమానులు, సెల‌బ్రిటీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Wsm Kundensupport Und Servicequalität Für Spieler In DE
Advertisement