నూతన సీఎస్ గా సమీర్ శర్మ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించింది.

ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ఈ నెలాఖరుకు ముగియనుండడంతో నూతన సీఎస్ గా సమీర్ శర్మ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 30న ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనుండగా.అక్టోబర్ 1వ తేదీన సమీర్ శర్మ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.1985 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు.రాష్ట్ర విభజన అనంతరం సమీర్ శర్మ సెంట్రల్ సర్వీస్లో కొనసాగారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో డైరెక్టర్ గా ఉన్నారు.మూడు నెలల క్రితం తిరిగి స్టేట్ కాడర్ ఏపీకి వచ్చారు.

ప్రస్తుతం సమీర్ శర్మ ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి పలువురు పేర్లను ప్రభుత్వం పరిశీలించింది ప్రస్తుతం ఎస్ఈసీ నీలం సహాని భర్త అజయ్ సహానీ పేరు దాదాపు ఖరారు అయిందన తరుణంలో అనూహ్యంగా సమీకరణ సీరియస్ గా నియామకం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement
Sameer Sharma As The New CS, Sameer Sharma, Adityanath Das, Andhra Pradesh Opco

అజయ్ సహాని సీఎస్ నియమిస్తే సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని న్యాయనిపుణుల సలహాతో  ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం.దీంతో ప్రభుత్వం చివరకు సమీర్ శర్మ నియమానికి మొగ్గు చూపింది.

అయితే.సమీర్ శర్మ కూడా రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు.

ఈ తరుణంలో ఆయన రాష్ట్ర కేడర్  ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది.తొలుత ఆదిత్య దాస్ పదవీకాలం జూలైలో ముగిసినప్పుడు సీఎస్ గా సమీర్ శర్మ పేరు తెరపైకి వచ్చింది.

ప్రస్తుత సీఎస్ 1987 బ్యాచ్ కు చెందిన ఆదిత్యనాథ్ కంటే సమీర్ శర్మ రెండేళ్ళు సీనియర్.వచ్చేనెల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నా.

Sameer Sharma As The New Cs, Sameer Sharma, Adityanath Das, Andhra Pradesh Opco
సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?

ప్రభుత్వం పొడిగింపు ఇచ్చిన మహా అయితే ఓ ఐదు నెలలు మాత్రం చీఫ్ సెక్రటరీగా ఉంటారు.అయితే సివిల్ సర్వీస్ అధికారులకు సీఎస్ గా రిటైర్మెంట్ అవ్వడం లక్ష్యం కాబట్టి.కేంద్రం సర్వీసులో ఉన్న ఆయన ప్రత్యేకంగా మూడు నెలల కిందటే ఏపీకి వచ్చారు.

Advertisement

ఏపీకి వచ్చే ముందు వరకు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన కార్పొరేట్ ఆఫీసర్స్ విభాగాన్ని చూస్తున్నారు.సీఎస్ గా రిటైర్మెంట్ అయ్యే అవకాశం కోసం ఏపీకి వచ్చారు.

సమీర్ శర్మ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ కు సీఎస్ గా అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉండగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ఆయన పలుశాఖల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించారు.అంతకుముందు సీఎం నీలం సాహ్ని పదవీ కాలం కూడా అలాగే పొడిగించారు.

గతేడాది జూన్ 30 న ఆమె రిటైర్ కావలసి ఉండగా జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది.తరువాత ఇక పొడిగించే అవకాశం లేకపోవడంతో ఆమెకు కీలకమైన బాధ్యతలు ఎస్సీ భాద్యతలు అప్పగించారు.

ఆ తర్వాత ఆమె స్థానంలో చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు.

తాజా వార్తలు