స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదు.. కేంద్రం స్పష్టత

స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది.భారతీయ వివాహ వ్యవస్థతో స్వలింగ వివాహాలను పోల్చలేమని తెలిపింది.

సుప్రీం ధర్మాసనంలో స్వలింగ వివాహాలకు గుర్తింపు కోరుతూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

స్వలింగ వివాహాలు, భిన్న లింగాలకు చెందిన వారి పెళ్లిళ్లు వేర్వేరుగా ఉంటాయని వెల్లడించింది.వివాహ చట్టానికి అనేక హక్కులు, బాధ్యతలు ఉన్నాయన్న కేంద్రం నిర్ధిష్టమైన సామాజిక సంబంధాల కోసం గుర్తింపు పొందడం ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది.

అదేవిధంగా స్వలింగ వివాహ కేసులలో గృహహింస చట్టంతో పాటు ఇతర చట్టపరమైన నిబంధనలను అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది.అయితే స్వలింగ వివాహాల పిటిషన్లు దాఖలు కావడంతో సుప్రీం కేంద్రానికి నోటీసులు జారీ చేయగా ఈ మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

Advertisement
అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)

తాజా వార్తలు