Samantha: కోట్లు పెట్టి అమెరికాలో ఇల్లు కొన్న సమంత.. కారణం ఏంటో తెలుసా..?

ఇప్పటికే సమంత ( Samantha ) కి ముంబై, హైదరాబాదులలో లగ్జరీ ఇల్లు ఉన్నాయి అనే సంగతి మనకు తెలిసిందే.

అంతే కాదు ఆమెకు లగ్జరీ కార్లు,స్థిరచరాస్తులు బాగానే ఉన్నట్లు సమాచారం.

కానీ ఉన్నట్టుండి సమంత అమెరికాలో ఇల్లు కొనడానికి కారణం ఏంటి.అసలు కోట్లు ఖర్చుపెట్టి ఎప్పుడో ఒకసారి వెళ్ళే అమెరికాలో సమంత ఇల్లు ఎందుకు కొనుగోలు చేసింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

సమంత ఈ మధ్యకాలంలోనే ఖుషి( Khushi ),సిటాడెల్ వంటి సినిమా షూటింగులు పూర్తి చేసింది.అయితే మయాసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా బయట పడకపోవడంతో ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం వల్ల దుమ్ము, ధూళి అలాగే కెమెరా లైటింగ్ తన మీద పడడంతో మరోసారి అనారోగ్యానికి గురైంది.

దాంతో మెరుగైన చికిత్స కోసం మరోసారి సమంత అమెరికాకు పయనమైంది.ఇక న్యూయార్క్ ( New York ) లో ఇండియన్స్ వాళ్ళు నిర్వహించే ఇండిపెండెన్స్ డే పరేడ్ ర్యాలీలో పాల్గొని సందడి చేసింది.ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ తనకి ఇష్టమైన ఫుడ్ ని తింటుంది.

Advertisement

అలాగే తన మయోసైటిస్ కు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది.ఇక ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.సమంత అమెరికాలో కూడా ఒక లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసిందట.

దానికి కారణం ప్రతిసారి తన మయాసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వచ్చినప్పుడు హోటల్స్ లో ఉంటే హోటల్ బిల్లు చాలా అవుతుందట.అలాగే ఈసారి మయోసైటిస్ నుండి పూర్తిగా బయటపడడం కోసం అమెరికా ( America ) లో మెరుగైన ట్రీట్మెంట్ తీసుకుంటుందట.

దీనికోసం రెండు మూడు నెలలు సమంత అక్కడే ఉండబోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సమయంలో హోటల్స్ లో ఉంటే డబ్బులు ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో అమెరికాలో తనకోసం అన్ని సౌకర్యాలు ఉండే ఒక ఇల్లుని సమంత కొనుగోలు చేసిందని విశ్వసనీయ సమాచారం.ఇక ఇండియా తిరిగి వచ్చేవరకు సమంత ఆ ఇంట్లోనే ఉంటుందని తెలుస్తోంది.

మరి నిజంగానే సమంత ( Samantha ) అమెరికాలో ఇల్లు కొనుగోలు చేసిందా అనే విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు