అతడితో నా అనుబంధానికి పేరు పెట్టలేను.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

సినిమాలలో నటించక పోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంటుంది సమంత.మొన్నటి వరకు మయోసాటిస్ వ్యాధి( Myositis ) నుంచి నెమ్మదిగా కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వాలని చూస్తోంది.

కాగా ఈ మధ్య తరచూ ఏదో ఒక విషయంలో సమంత పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

Samantha Speaks About Relation With Rahul Ravindran Details, Samantha, Tollywood

తాజాగా మరోసారి సమంత పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తాజాగా కోలీవుడ్‌ లో నిర్వహించిన గోల్డెన్‌ క్వీన్‌ పురస్కారాల్లో సమంత గోల్డెన్‌ క్వీన్‌ గా అవార్డు( Golden Queen Award ) తీసుకున్నారు.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.

Advertisement
Samantha Speaks About Relation With Rahul Ravindran Details, Samantha, Tollywood

తన కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అలాగే దర్శకుడు, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌( Rahul Ravindran ) తో తన అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా సామ్ మాట్లాడుతూ.నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్‌ నావెంటే ఉన్నాడు.

ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు.

Samantha Speaks About Relation With Rahul Ravindran Details, Samantha, Tollywood

మా అనుబంధానికి పేరు పెట్టలేను.నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడా అని చెప్పలేను అని అన్నారు సమంత.అనంతరం అభిమానుల గురించి మాట్లాడుతూ.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం నా అదృష్టం.అదృష్టం తో పాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానానికి కారణం.

Advertisement

దేవుడిచ్చిన వరంగా భావిస్తాను.మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్‌ ఎలా ఉంటుందో చెప్పలేము.

ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్‌ చేస్తే అది అబద్ధమే అవుతుంది.తెలిసి, తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలు కెరీర్‌పై ప్రభావం చూపుతాయి అని సమంత తెలిపారు.

ఈ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు