వైరల్.. పెళ్లి రోజునాడు సమంత పోస్ట్.. ఇందులో ఏదో గూఢార్థం దాగి ఉందట!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకుని అంతో అన్యోన్యంగా ఉంటూ అందరిని ఆకర్షిస్తూ ఉండేది ఆ జంట.

కానీ విడాకులు ప్రకటించి ఒక్కసారిగా అందరిని షాక్ కు గురి చేసాడు.

సమంత ఒక నెల ముందు నుండే సోషల్ మీడియాలో హింట్ ఇస్తూ వచ్చింది.కానీ ఇదంతా పబ్లిసిటీ స్టెంట్ అని కొంతమంది కొట్టి పారేసారు.

కానీ నాగ చైతన్య, సమంత ఒక్కసారిగా విడాకులు ప్రకటించి అందరికి షాక్ అయితే ఇచ్చారు.వీరిద్దరూ అసలు విడిపోతున్నారంటే ఇప్పటికే అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

అయితే ఈ విడాకులు లేకపోయి ఉంటె ఈ రోజు నాగ చైతన్య, సమంత జంటకు స్పెషల్ రోజు అనే చెప్పాలి.అదే పెళ్లి రోజు. అవును అంతా బాగుంటే ఈ రోజు చైసామ్ నాలుగవ పెళ్లి రోజు జరుపుకునే వారు.2017 అక్టోబర్ నెలలో నాగ చైతన్య, సమంత జంట హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.అక్టోబర్ 6, 7 రెండు రోజులు కూడా చైసామ్ కు ముఖ్యమైన రోజు.

Advertisement

గత సంవత్సరం ఇదే రోజు సమంత నాగ చైతన్య కోసం ఒక పోస్ట్ పెట్టింది.

ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.కానీ నాలుగేళ్లు తిరక్కుండానే వాళ్ళ జర్నీ ముగించేయడం అందరికి బాధాకరమైన విషయం.తాజాగా సమంత విడాకుల ప్రకటన తర్వాత ఈ రోజు మళ్ళీ కొత్త పోస్ట్ పెట్టింది.

ఇప్పుడు ఈ పోస్ట్ కూడా సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

సమంత ఒక ఫోటో షేర్ చేస్తూ తన మనసులోని భావాలను కొంచెం అర్ధం అయినట్టు కొంచెం కానట్టు తెలిపింది.అయితే ఈమె పెట్టిన పోస్ట్ లో మనకు తెలియని గూడార్ధం కూడా ఉందట.పాత ప్రేమ కథలు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

పర్వతాలు, శీతాకాలపు గాలి. అంటూ సమంత తన మనసులోని భావనను తెలిపింది.

Advertisement

అంతేకాదు సమంత షేర్ చేసిన ఫోటో చుస్తే సమంత బాధగా ఉన్నట్టు కనిపిస్తుంది.ఈ బాధను మర్చిపోవడం కోసం సామ్ బిజీగా ఉంటుంది.

ఇక రేపు జరగబోతున్న లాక్మీ ఫ్యాషన్ వీక్ కు సామ్ సిద్ధం అవుతుంది.దీనిలో భాగమే ఈ ఫోటో షూట్ అని తెలుస్తుంది.

తాజా వార్తలు