శాకుంతలం ఆ సీక్రెట్ చెప్పిన సమంత..!

సమంత( Samantha ) ప్రధాన పాత్రలో గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా శాకుంతలం.ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు.

సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా సమంత సౌత్ తో పాటు నార్త్ లో కూడా ప్రమోషన్స్ చేస్తుంది.శాకుంతలం సినిమాకు సమంత ని చూసే హిందీలో మార్కెట్ జరుగుతున్నట్టు ఉంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా బడ్జెట్ గురించి అందరు అనుకుంటున్న మాట బయట పెట్టారు సమంత.నిజానికి సినిమా మొదలు పెట్టడానికి అనుకున్న బడ్జెట్ కన్నా పూర్తి చేసే సరికి ఎక్కువైందని అన్నారు.

ఇదే న్యూస్ శాకుంతలం( Sakunthalam ) సెట్స్ మీద ఉన్నప్పుడు బయటకు వచ్చినా మేకర్స్ అలాంటిది ఏమి లేదన్నట్టు చెప్పుకొచ్చారు.కానీ ఇప్పుడు సమంత ఈ విషయాన్ని చెప్పడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.

Advertisement

అయితే ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో ఇంత బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇదే అంటుంది సమంత.అంతేకాదు సినిమా నన్ను నమ్మి చేస్తున్నప్పుడు వారికి పూర్తి సహకారం అందించాల్సిందే కదా అని అంటుంది.

యశోద టైం లో బయటకు రాని సమంత శాకుంతలం కి మాత్రం బాగా ప్రమోట్ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు