గతంలో నేను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే.. సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత చివరగా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగానే ఇటీవల ఆమె సిటాడెల్( Citadel ) ఇండియన్ వెబ్ సిరీస్ లో నటించగా ఆ వెబ్ సిరీస్ రిలీజ్( Web series ) కు సిద్ధమవుతోంది.

ఇకపోతే గత కొద్ది రోజులుగా సమంత ఎక్కువగా బాలీవుడ్( Bollywood ) సినిమాల వైపే ఫోకస్ చేస్తోంది అన్న వార్త వైరల్ గా మారింది.తెలుగులో అయితే కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంట.లేదంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కోసం వెయిట్ చేస్తోందట సామ్.

Advertisement

కాగా సమంత ఆ మధ్య నిర్మాతగా మారి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.తన ప్రొడక్షన్ లో బంగారం అనే మూవీని కూడా ఎనౌన్స్ చేసింది.

ఈ సినిమాలో సమంతనే లీడ్ రోల్ చేయనుంది.ఇదిలా ఉంటే కొంత కాలం నుంచి ఈ బ్యూటీ ఆరోగ్యంపై పాడ్ కాస్ట్ చేస్తోంది.

ఆల్కేష్ సహోత్రితో( Alkesh sahotri ) కలిసి టేక్ 20 ( Take 20 )అనే పేరుతో పాడ్ కాస్ట్ రిలీజ్ చేసింది.ఇందులో ఆరోగ్యానికి సంబందించిన టిప్స్ ని ఫ్యాన్స్ తో సమంత పంచుకుంది.ఆరోగ్యకరమైన ఫుడ్స్ ని పాడ్ కాస్ట్ ద్వారా సమంత ప్రమోట్ చేస్తోంది.

ఇందులో ఒక నెటిజన్ సమంత చెబుతున్న ఆరోగ్యకరమైన టిప్స్ పై కామెంట్ చేశాడు.ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు బాగానే ఉన్నాయి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు కదా దానికి ఏం సమాధానం చెబుతారని అడిగగా.సమంత ఆ కామెంట్ పై రియాక్ట్ అయ్యింది.

Advertisement

గతంలో నేను కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవమే.అయితే అవి పూర్తిగా తెలియక చేసినవి మాత్రమే అని సమంత తెలిపింది.

తెలుసుకున్న తర్వాత అన్నింటిని పూర్తిగా ఆపేసాను.ఇప్పుడు నేను ఏవైతే ఆచరిస్తున్నానో అవి మాత్రమే చెబుతున్నాను అని సమంత తెలిపింది.

తాజా వార్తలు