Samantha : ఆ ఏడాది చాలా కష్టంగా మారింది..విడాకుల వార్తల పై స్పందించిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అయ్యారు.

అయితే ఇలా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి తరుణంలో ఈమె మాయోసైటిస్ వ్యాధి( Myositis )కి గురైనట్లు తెలియడంతో తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ పూర్తి చేసి ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అందరితో పంచుకుంటున్నారు.

తాజాగా సమంత హెల్త్ పాడ్ కాస్ట్ సిరీస్ TAKE20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది.ఇందులో ఆమె అనారోగ్య సమస్యలు, చికిత్స, జాగ్రత్తలు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఇలా ఆరోగ్య సమస్యల గురించి మాత్రమే కాకుండా ఈమె మరోసారి తన విడాకుల( Divorce ) వార్తల గురించి కూడా ఈ సందర్భంగా స్పందించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత కొంతకాలంగా తనకు కష్టమైనటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది విడాకులు తీసుకొని విడిపోయినప్పుడు అంటూ సమంత చెప్పుకు వచ్చారు.

Advertisement

నాకు మయోసైటిస్ సమస్య రావడానికి ముందు ఏడాది ప్రత్యేకంగా గుర్తుంది.ఎందుకంటే ఆ సంవత్సం చాలా కష్టతరమైనది అంటూ విడాకుల విషయాని గుర్తు చేసుకుంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.నాగచైతన్యను( Naga Chaitanya ) ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సమంత చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా వీరు విడాకుల వరకు వెళ్లిపోయారు విడాకులు తీసుకున్న సమయంలో సమంత పూర్తిగా డల్ అయిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ సంఘటన నుంచి బయటపడటం కోసం పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళుతూ తనని తాను ముందుకు నడిపించుకున్నారు.అంత సెట్ అయిందనుకున్న తరుణంలోనే ఈమె మయోసైటిస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు