ఆ ప్రేమ నా కుక్క ప్రేమ కంటే గొప్పదేం కాదు.... సమంత కౌంటర్ శోభితకేనా?

నాగచైతన్య (Nagachaitanya) శోభితల (Sobhita ) వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

అయితే ప్రస్తుతం వీరిద్దరూ వారి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత పెళ్లి ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చైతన్య పై తనకున్నటువంటి ప్రేమను బయటపెట్టారు.నాగచైతన్య ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటారు.

ఆయన ఎలాంటి సందర్భం వచ్చిన అంతే కూల్ గా ఉంటారు.నేను ఎలాంటి ప్రేమ కోసమైతే వెతుకుతున్నానో ఆ ప్రేమ చైతన్య వద్ద నాకు దొరికింది అంటూ ఈమె తన భర్త పై ఉన్న ప్రేమను బయటపెట్టారు.

ఇలా శోభిత నాగచైతన్య(Sobhita, Nagachaitanya) పై తనకున్నటువంటి ప్రేమను తెలియజేస్తూ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా శోభితకు కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి.ఈమె కూడా తన కుక్కతో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఇక ఈ ఫోటోని షేర్ చేసిన సమంత(Samantha ) నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా గొప్పది కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఈ విధంగా శోభిత చేసిన పోస్ట్ కు సమంత రీకౌంటర్ ఇస్తున్న విధంగా ఈ పోస్ట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక సమంతకు డాగ్స్ అంటే చాలా ఇష్టం అనే విషయం మనకు తెలిసిందే.ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్న పెట్స్ తో ఈమె కలిసి  దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత పూర్తిగా తన కెరియర్ పైన ఫోకస్ పెట్టారు.ఇక ఇటీవల హనీ బన్నీ అనే వెబ్  సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు