VD11 : ఫస్ట్ లుక్ వచ్చేసింది.. విజయ్, సమంత.. 'ఖుషీ'.. అదిరిందిగా..

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా వస్తుంది.

ఈ సినిమా వస్తుంది అని ఎన్నో రోజులుగా వినిపిస్తున్న గత కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా స్టార్ట్ చేసారు.

విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే అంచనాలు భారీగా పెరిగాయి.విజయ్, సమంత జోడీ అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది. #VD11 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెసెంట్ కాశ్మీర్ లో షూటింగ్ జరుపు కుంటుంది.

Advertisement
Samantha And Vijay Deverakondas Next Titled Kushi-VD11 : ఫస్ట్ లు

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.అలా స్టార్ట్ చేసారో లేదో ఇప్పుడు టైటిల్ ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఖుషి అనే టైటిల్ పెట్టబోతున్నారు అనే వార్త వైరల్ అవుతూనే ఉంది.

Samantha And Vijay Deverakondas Next Titled Kushi

మరి ఎట్టకేలకు ఇదే టైటిల్ ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సమంత ట్రెండీ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్నారు.విజయ్ సిగరెట్ తాగుతూ స్టైలిష్ గా కనిపించగా.

సమంత ట్రెడిషనల్ లుక్ లో శారీలో కనిపించింది.అలాగే విజయ్ డ్రెస్ కు సామ్ శారీని ముడి వేశారు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

వీరిద్దరూ చాలా లవ్లీ లుక్ లో ఖుషీ ఖుషీగా అకనిపిస్తున్నారు.ఈ పోస్టర్ అమితంగా ఆకట్టు కోవడమే కాకుండా ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాయి.

Advertisement

తాజా వార్తలు