ఆ పాత్ర కోసం పోటీ పడుతున్న అనుష్క, సమంత..!

గ్రేట్ డైరక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు తన డ్రీం ప్రాజెక్ట్ గా బెంగుళూరు నాగరత్తమ్మ సినిమా చేయాలని అనుకున్నారు.

దేవదాసి అయిన బెంగుళూరు నాగరత్తమ్మ జీవిత కథతో ఇప్పటికే సింగీతం శ్రీనివాస్ రావు కథని సిద్ధం చేయగా దీనికి సంబందించిన డైలాగ్ వర్షన్ కూడా సాయి మాధవ్ బుర్రతో సిద్ధం చేయించారు.

ఇక ఇదిలాఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు ఈ సినిమాలో నటించేందుకు పోటీ పడుతున్నారని తెలుస్తుంది.అందులో ఒకరు అనుష్క కాగా మరొకరు సమంత అని టాక్.

అయితే సమంతతో చేయాలని అనుకోగా ఆమె వేరే ప్రాజెక్టుల వల్ల దాదాపు ఈ సినిమా చేయడం కుదరదని చెప్పిందట.ఇప్పుడు బెంగళూరు నాగరత్తమ్మ సినిమా కథ అనుష్క దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది.

అనుష్క, సమంత ఇద్దరిలో ఎవరు చేసినా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు.నిశ్శబ్ధం సినిమా తర్వాత అనుష్క నవీన్ పొలిశెట్టితో ఒక సినిమా సైన్ చేసింది.

Advertisement

అనుష్క చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సమంత వరుస సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీగా ఉండగా ఈ నాగరత్తమ్మ ప్రాజెక్ట్ ని చేయాలని ఉన్నా డేట్స్ అడ్జెస్ట్ అవట్లేదట.

అందుకే ఆ ఛాన్స్ అనుష్కకే వరించిందని టాక్.

Advertisement

తాజా వార్తలు