కండల వీరుడి సాంగ్ లో గెస్ట్ లుగా మారిన వెంకీ, చరణ్...

బాలీవుడ్ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్( Salman Khan ) హిందీలో చేస్తున్న ఒక సినిమాకి సంభందించిన ఒక పాట రిలీజ్ అయింది దాంట్లో వెంకటేష్ రామ్ చరణ్( Venkatesh Ram Charan ) ఇద్దరు కలిసి సల్మాన్ ఖాన్ తో స్టెప్ లు వేశారు ప్రస్తుతం ఇక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది.

ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ రీమేక్ లో ప్రధాన పాత్రలు అన్ని టాలీవుడ్ స్టార్స్ చేస్తున్నారు.విక్టరీ వెంకటేష్ , పూజా హెగ్డే , జగపతి బాబు నటిస్తున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు అందుకోవాలి అని సల్మాన్ ఖాన్ ఎక్కువగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే బతుకమ్మ సాంగ్ వచ్చింది.ఇక ఇప్పుడు మరో పాటను విడుదల చేసారు.

ఆ పాటలో రామ్ చరణ్ కూడా మెరిశాడు ఈ మూవీలో పూజ హెగ్డే( Pooja Hegde ) వెంకటేష్ కి చెల్లెలి పాత్రలో కనిపిస్తుండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా వెంకటేష్ కుటుంబం కనిపించనుంది.

Advertisement

ఈ సినిమా తెలుగు జనాలను కూడా గట్టిగానే ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు అర్ధమవుతోంది.ఈ సినిమాతో వెంకటేష్ కూడా బాలీవుడ్ లో హైలెట్ అవ్వాలని అనుకుంటున్నాడు.ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ రిలీజ్ అయింది.

ఏంటమ్మా అంటూ సాగుతున్న ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరికీ విపరీతం గా నచ్చుతుంది అనే చెప్పాలి.ఈ సినిమా ని ఆల్రెడీ తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు గా రీమేక్ చేశాడు.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన శృతి హాసన్ నటించింది.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement

తాజా వార్తలు