గాడ్ ఫాదర్ కోసం పవన్ ను అందుకే వద్దు అనుకున్నారట!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అని చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఆతృతగా ఎదురు చూసారు.కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగిపోతుంది.

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.

డీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.

Advertisement

అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరు సల్మాన్ ఖాన్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకుని ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది అని చాలా మంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

సల్మాన్ ఖాన్ రోల్ మాత్రం తెలుగు ఆడియెన్స్ ను అలరించలేక పోయింది అనే చెప్పాలి.ఇతడు కేవలం హిందీలో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగ పడ్డాడు కానీ ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాడు.

అందుకే పవన్ కళ్యాణ్ ఉంటే బాగుండేది అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మెగా అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే కిక్ వేరుగా ఉండేది అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కాకపోయినా ఏ మెగా హీరో అయిన చేసిన ఆ సీన్ వేరేగా ఉండేది అని అంటున్నారు.ఈ క్రమంలోనే మోహన్ రాజా తాజాగా ఈ విషయంపై మాట్లాడారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

సల్మాన్ ఖాన్ ను తీసుకోవడం తన ఛాయిస్ అని.అయితే ఆయన్ని అలంకరణ కోసమే అని మోహన్ రాజా తెలిపారు.నేను దీనిని సినిమాగా చూసా అని పర్సనల్ కనెక్షన్ గురించి ఏమాత్రం ఆలోచనలేదు.

Advertisement

ఫ్యామిలీలో హీరో చెప్పడం కంటే.బయట నుండి స్టార్ గురించి చెప్పడం బాగుంటుంది అని నేను అనుకున్నా.

అలా అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించాను.అని చెప్పుకొచ్చింది.