ఆ విషయంలో 'సలార్' మేకర్స్ సీరియస్.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.

మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో భారీ హైప్ తెచ్చుకున్న మూవీ సలార్.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

అసలైతే ఈ సినిమాను సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు.

Advertisement

మరి ఇప్పుడు రిలీజ్ కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో ప్రతీ రోజు ఏదొక కారణంతో అయితే వినిపిస్తుంది.గత కొన్నాళ్ల నుండి ఈ సినిమా నుండి పలు లీక్స్ మేకర్స్( Leeks Makers ) కు ఇబ్బంది కలిగిస్తున్నాయి.

సోషల్ మీడియాలో( Social media ) ఏదొక లీక్ వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా సలార్ మేకర్స్ ఇలా లీక్స్ చేసే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది.తమ కంటెంట్ ను స్ప్రెడ్ చేసే ఇద్దరిని సైబర్ క్రైం వారికీ పట్టించినట్టు తెలుస్తుంది.అంతేకాదు ఇక నుండి సలార్ కంటెంట్ ను ఎవ్వరైనా స్ప్రెడ్ చేయాలనీ చుస్తే ఇబ్బందులు తప్పవని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

ఎట్టకేలకు మేకర్స్ అయితే లీక్స్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవడం మంచి పరిణామమే అంటున్నారు విశ్లేషకులు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement

తాజా వార్తలు