సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సైఫ్ అలీ ఖాన్.. కారణం ఏంటంటే!

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ లో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సైఫ్ అలీ ఖాన్.

ఓంకార,ఏజెంట్ వినోద్,కాక్ టెయిల్ ఇలాంటి సినిమాలలో నటించి మరింత గుర్తింపును సంపాదించుకున్నాడు సైఫ్ అలీ ఖాన్.అయితే మామూలుగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటారు.

కానీ సైఫ్ అలీ ఖాన్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని వివరించాడు సైఫ్ అలీ ఖాన్.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సోషల్ మీడియాలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించానని సైఫ్ అలీ ఖాన్ కానీ ఇప్పటికే నా పేరు మీద ఎన్నో హ్యాండిల్స్ ఉన్నాయి అని తెలిపారు సైఫ్ అలీ ఖాన్.

Advertisement

కాకపోతే సరైన ఐడీ లభించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపాడు సైఫ్ అలీ ఖాన్.అలాగే సోషల్ మీడియాలో ఉంటే చాలా ఆందోళన ఉంటుంది.

ఎందుకంటె అనేక అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది.ఒకవేళ ఆ అబద్ధాలు చెప్పడానికి సిద్ధమైనా ఇతరులను కూడా పొగడాలి.

ప్రస్తుతం నేను సంతోషంగానే ఉన్నాను.

అందువల్లే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను అని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు.ఇకపోతే సైఫ్ అలీ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.తాజాగా విక్రమ్ వేద సినిమాతో ప్రేక్షకులకు పలకరించాడు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

అలాగే టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది‌పురుష్ సినిమాలోను కీలక పాత్ర పోషిస్తున్నాడు.రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ విడుదల కానుంది.

తాజా వార్తలు