భార్య టాటూను తొలగించుకున్న దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్.. కారణాలివేనా?

సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ క్యూట్ కపుల్ కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ (Kareena Kapoor, Saif Ali Khan)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్గా రాణిస్తున్న ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

పెళ్లి అయినప్పటినుంచో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ గా నిలుస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వచ్చారు కరీనా, సైఫ్ అలీ ఖాన్.ప్రస్తుతం ఈ జంట ఎవరికి వారు కెరియర్ పరంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఈ జంట 16 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు. (Timur Ali Khan, Jahangir Ali Khan) అనే ఇద్దరు కుమారులకు వారు తల్లిదండ్రులు.చాలా సంవత్సరాల క్రితం ప్రేమాయ‌ణంలో ఉన్న సమయంలో కరీనా పేరును తన మోచేతిపై పచ్చబొట్టు వేయించుకుని సైఫ్ అంద‌రి హృదయాలను గెలుచుకున్నాడు.

Advertisement

అయితే ఇటీవల విమానాశ్రయంలో చూసినప్పుడు, సైఫ్ మునుపటి పచ్చబొట్టును కవర్ చేస్తూ కొత్త టాటూతో కనిపించాడు.ఇక అందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ మధ్య అంతా బాగానే ఉందా? లేక వీరిద్దరూ ఏమైనా గొడవపడ్డారా? సైఫ్ అలీ ఖాన్ ఎందుకు ఆ టాటోని రిమూవ్ చేశారు అంటూ చాలా మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నిన్ననే వీరిద్దరూ తమ ఇంటి వెలుపల ముద్దులు పెట్టుకోవడం మీడియా వైరల్ అయ్యింది.అలాంటిది ఇప్పుడు సడన్ గా టాటూ కనిపించక పోవడంతో చాలామంది అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కొంద‌రు అభిమానులు సైఫ్ త‌న‌ సినిమా కోసం టాటూ తొల‌గించుకున్నాడ‌ని అనుకుంటున్నారు.

అయితే కారణాలు ఏంటి అన్నది తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు