Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఒక ఐరన్ లెగ్ నటుడా ? అసలు వాస్తవాలు ఇవే !

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆదిపురుష్ సినిమా( Adipurush ) ద్వారా సైఫ్ అలీ ఖాన్ తొలిసారిగా పరిచయమయ్యాడు.

ఈ సినిమా పరాజయం పాలవడంతో నిజంగానే ఒక ఐరన్ లెగ్ అని భావించారు.

మిగతావారు నటనతో పోలిస్తే ఈ చిత్రంలో సైఫ్ నటన చాలా దారుణంగా ఉంది అతడేమీ జనాలను తన నటనతో ఇంప్రెస్ చేయలేకపోయాడు.కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నటులు బాగా చేస్తారు.

కానీ సైఫ్ ఆ మాత్రం ప్రభావం కూడా చూపించలేదు.ఇందులోనే కాదు అతడు నటించిన చాలా సినిమాలు కూడా అలాగే ఫ్లాప్ అవుతూ ఉంటాయి.

మొదటి నుంచి బాలీవుడ్ లో అతడు ఒక ఐరన్ లెగ్ అనే భావన ఉంది.

Advertisement

ఆది పురుష్ సంగతి కాస్త పక్కన పెడితే తాను మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా( Devara Movie )లో కూడా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) విలన్ గా నటిస్తున్నాడు.ఆది పురుష్ సినిమా చూసిన తర్వాత వామ్మో సైఫ్ ని విలన్ గా ఎందుకు తీసుకున్నారా అని చాలా మంది అనుకున్నారు.అయితే కాస్త వెనక్కి వెళ్తే 2004లో హం తుం అనే సినిమాలో సైఫ్ హీరోగా నటించాడు ఈ సినిమాలో అతడి సరసన రాణి ముఖర్జీ సినిమాలో ఎంతో చక్కగా నటించారు.

సినిమా చూస్తున్నంత సేపు ఒక సెలబ్రేషన్ లా అనిపిస్తుంది.ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.

నేషనల్ స్థాయి అవార్డు( National Level Award ) రావడం అంటే అదే మీ మామూలు విషయం కాదు ఒకవేళ అలాంటి ఒక గొప్ప అవార్డు అందుకున్నంత మాత్రాన ఆ నటులు ఏమీ గొప్పవారు కాదు.అవార్డుకు అతీతంగా చాలా మంది నటులు తమ గొప్ప నటనను చూపిస్తూ ఉంటారు.అయితే సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక బ్రిలియంట్ నటుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక విజయ్ సేతుపతి మాధవన్ తమిళ్ లో నటించిన విక్రమ్- వేద( Vikram Veda ) అనే ఒక క్లాసిక్ మూవీ ని బాలీవుడ్ లో రీమేక్ చేయగా అందులో సైఫ్ అద్భుతంగా నటించాడు.అతడు ఒక ప్యాషన్ ఉన్న నటుడు అని చెప్పచ్చు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు