మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఒకరు.
మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్టపడుతున్నాడు.
మెగా హీరో (Mega Hero) అనే చట్రం నుండి బయటపడి తనకంటూ స్పెషల్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కోవాలని బాబు ఆరాట పడుతున్నాడు.ఈ క్రమంలోనే సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన సినిమా విరూపాక్ష(Virupaksha).
నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.అందుకు కారణం కూడా లేకపోలేదు.
ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu) తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.మేకర్స్ కూడా భారీ నిర్మాణ విలువలతో ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ టీమ్ అంతా సినిమా విజయం మీద ధీమాగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా లోని క్యారెక్టర్స్ ను ఇంట్రడక్షన్ చేస్తూ నిర్వహించిన ఈవెంట్ కు కూడా మంచి స్పందన వచ్చింది.
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.అతి త్వరలోనే ట్రైలర్ (Virupaksha Trailer) రిలీజ్ ఉంటుంది అని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.అయితే ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు.
మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.చూడాలి సుకుమార్ అసిస్టెంట్ సాయి తేజ్ కు మంచి హిట్ ఇస్తాడో లేదో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy