సాయి పల్లవికి ఆయన అంటే అంత ఇష్టమా.. ఇప్పటికి వాటిని దాచుకుందట..

మన టాలీవుడ్ లో ఎంత మంది ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఈమె మాత్రం అందరికి స్పెషన్ నే.ఈమెకు హీరోల మాదిరిగా స్పెషల్ ఫాలోయింగ్ ఉంది.

అలా అని ఈమె చాలా సినిమాలు చేసింది అని అనుకోకండి.ఈమె చేసింది కొద్దీ సినిమాలే అయినప్పటికీ ఈమె మాత్రం అందరికి ఫెవరెట్ యాక్ట్రెస్.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది అనుకుంటా.ఈమె మరెవరో కాదు.

ఫిదా తో అందరిని ఫిదా చేసి అందరి చేత శబాష్ అనిపించుకున్న ముద్దు గుమ్మా సాయి పల్లవి.ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది.

Advertisement

ఇక ఇటీవల కాలంలో ఈమెపై చాలా రూమర్స్ వస్తున్నాయి.సినిమాలు మానేసిందని, పెళ్లి చేసుకోబోతుంది అంటూ వరుస రూమర్స్ వస్తున్నాయి.

అయితే ఈ రూమర్స్ అన్నిటిని పటాపంచెలు చేస్తూ మరొక సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది.ఈమె నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈ సినిమా తర్వాత మరొక సినిమా ఒప్పుకోలేదు.కానీ ఈమె పుట్టిన రోజు నాడు గార్గి అనే పేరుతొ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది.

ఈ సినిమా కూడా డిఫెరెంట్ జోనర్ లో ఉండబోతుంది అని ఫస్ట్ లుక్ తోనే అర్ధం అయ్యింది.అయితే తాజాగా ఈ అమ్మడు పాల్గొన్న ఇంటర్వ్యూలో ఫెవరెట్ హీరో ఎవరో అడుగగా ఈమె చెప్పిన ఆన్సర్ అందరిని ఆశ్చర్య పరిచింది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

ఈమె పాల్గొన్న ఇంటర్వ్యూలో ఫెవరెట్ హీరో ఎవరు అని అడుగగా.కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి అని తెలిపింది.అయితే వీరిలో ఈమెకు కమల్ అంటే మరింత ఇష్టమట.

Advertisement

ఈయన నటించిన సినిమాల పోస్టర్స్ పేపర్ లో వస్తే వాటిని జాగ్రత్తగా కట్ చేసి దాచుకునేదట.ఆ పోస్టర్స్ ఇప్పటికి జాగ్రత్తగా ఉన్నాయి అని చెప్పడంతో ఈమెకు ఆయనపై ఉన్న పిచ్చి ఇష్టానికి అందరు షాక్ అవుతున్నారు.

తాజా వార్తలు