Sai Pallavi : డెడికేషన్ కి డిక్షనరీ లో సాయి పల్లవి అని అర్ధం వచ్చేలా కష్టపడుతుందా ?

సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ ఎంత బాగా వచ్చినా అదే రేంజ్ డెడికేషన్ లేకపోతే ఖచ్చితంగా ముందుకు వెళ్లడం కష్టం.

ఆటిట్యూడ్ తో పాటు యాక్టింగ్ తెలిసిన నటుడే ఖచ్చితంగా స్టార్ అవుతారు.

అలాంటి లక్షణాలను పునికి పుచ్చుకున్న ఏకైక నటిమని సాయి పల్లవి( Sai Pallavi ).ఆమె ఒక సినిమా కోసం ఎంత కష్టపడుతుందో ఏ స్థాయికి అయినా వెళ్లి కష్టపడుతుందో మనం ఇప్పటి వరకు చూస్తూనే వస్తున్నాం.ఆమె నటించబోయే ప్రతి సినిమా కోసం ఆమె ఎంతో తాపత్రయపడుతుంది.

దానికోసం అంతే డెడికేషన్ పెట్టి వర్క్ చేస్తుంది.ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో( Tandel ) నటిస్తున్న సాయి పల్లవి ఈ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకుంటుందట.

ఇంతకీ సాయి పల్లవి తీసుకుంటున్న రిస్క్ ఏంటి ? దానివల్ల ప్రయోజనం ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది సాయి పల్లవి.ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్( Telangana slang ) చాలా చక్కగా మాట్లాడింది.దానికోసం ఆమె ఎంతో కష్టపడి ఈ భాషను నేర్చుకుంది.

ఇప్పటికీ ఇంటర్వ్యూలలో సాయి పల్లవి నోటి నుంచి అనేక తెలంగాణ వర్డ్స్ వస్తూ ఉంటాయి.ఏదైనా చిత్రంలోని క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత స్థాయి రిస్కైనా తీసుకోవడానికి రెడీగా ఉంటుంది.

చేసిన తక్కువ సినిమాలతో ఆమె ఇంత గొప్ప పేరు సాధించింది అంటే అందుకు తన డెడికేషన్ మొదటి కారణం.ఇప్పుడు ఉత్తరాంధ్ర యాస నేర్చుకోవడానికి చాలా కష్టపడుతుందట.

తండేల్ సినిమా పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుంది.దానికోసం స్పెషల్ ట్యూటర్ నీ కూడా పెట్టుకుని ఆ భాష పై పట్టు సాధించే పనిలో ఉందట.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఓ వైపు సౌత్ ఇండియాలో నటిస్తూనే మరో వైపు హిందీలో కూడా బిజీ అవుతుంది.అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ( Junaid Khan )తో ఒక సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి హిందీ రామాయణం లో సీత పాత్రలో నటిస్తుంది.అందుకోసం హిందీ క్లాసులు కూడా వింటుందట, అక్కడి హిందీ భాషకి ఇక్కడి హిందీ భాషకు తేడా ఉంటుంది కాబట్టి పూర్తి నార్త్ హిందీ పై ఫోకస్ పెట్టిందట.

Advertisement

ఇలా సినిమా సినిమాకి భాషలను అలాగే అనేక విషయాలను కొత్తగా నేర్చుకుంటూ ఆ సినిమాకి పూర్తి న్యాయం చేసే పనిలో ఉంటుంది.అందుకే డెడికేషన్ కి డిక్షనరీలో ఏదైనా అర్థం ఉంది అంటే అది సాయి పల్లవి మాత్రమే.

తాజా వార్తలు