బన్నీ బ్యూటీతో రొమాన్స్ చేస్తున్న తేజు

మెగా హీరో నుండి సుప్రీం హీరోగా మారిన సాయి ధరమ్ తేజ్ ఇటీవల ప్రతిరోజూ పండగే చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన తాజా చిత్రం ’సోలో బ్రతుకే సో బెటర్’ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని తేజు భావిస్తున్నాడు.అటు ఈ సినిమా తరువాత తన మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టేందుకు తేజు రెడీ అయ్యాడు.

టాలీవుడ్‌లో ప్రస్థానం వంటి పవర్‌ఫుల్ సినిమాతో తనదైన మార్క్ వేసిన దేవా కట్టా డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు తేజు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేశారు.

ఈ సినిమాలో తేజు పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఈ చిత్రంతో అతడిలోని నటుడు బయటకు వస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఇలాంటి హీరో పాత్రకు హీరోయిన్‌గా ఉండే పాత్ర కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Advertisement

ఈ పాత్ర కోసం నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేసుకోవడంలో కూడా కారణం ఉందట.గతంలో చిత్రలహరి చిత్రంలో తేజుతో కలిసి నటించిన నివేదా పేతురాజ్ యాక్టింగ్‌కు తేజు ఇంప్రెస్ అయ్యి ఆమెను రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలో కూడా నివేదా పేతురాజ్ నటించిన సంగతి తెలిసిందే.మరి దేవా కట్టా సినిమాలో తేజు, నివేదా పేతురాజ్ కాంబో ఎంత మేర ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు