ఆరోజు అందుకే కళ్యాణ్ మామయ్యను ఎత్తుకున్నాను: సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) తాజాగా ఉషా పరిణయం( Usha Parinayam ) అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ ఎన్నికల ఫలితాలు రోజు సాయి ధరమ్ తేజ పవన్ కళ్యాణ్ ను ఎత్తుకొని తన సంతోషం వ్యక్తం చేశారు.అలా మావయ్యను ఎత్తుకోవడానికి గల కారణాన్ని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

Sai Dharam Tej Interesting Comments On Pawan Kalyan , Pawan Kalyan, Sai Dharam T

ఆరోజు పవన్ కళ్యాణ్ మామయ్యను ఎత్తుకోవడానికి కారణం ఉందని తెలిపారు.చిన్నప్పుడు తాను ఒక టోర్నమెంటులో ఓడిపోయి చాలా బాధగా ఇంటికి వచ్చాను.అలా నన్ను చూసిన మామయ్య ఒక సారీ కాదు పదిసార్లు పోటీ చెయ్యి మరింత అద్భుతంగా ఆడు అంటూ నన్ను ఎంతో ప్రోత్సహించారు.

ఇలా ఆయన ప్రోత్సాహంతో తిరిగి తాను మరో టోర్నమెంటులో గెలిచానని తెలిపారు.

Sai Dharam Tej Interesting Comments On Pawan Kalyan , Pawan Kalyan, Sai Dharam T
Advertisement
Sai Dharam Tej Interesting Comments On Pawan Kalyan , Pawan Kalyan, Sai Dharam T

టోర్నమెంట్ లో గెలిచిన నేను ఎంతో ఆనందంతో ఇంటికి రాగా ఆయన కూడా అంతే ఆనందం సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే మామయ్య అంత అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత నేను కూడా ఆ విజయాన్ని ఎంతో సంతోషంతో సెలబ్రేట్ చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక రోడ్డు ప్రమాదం తర్వాత విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అనంతరం తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో నటించారు.త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు