త్యాగం అంటే రాహుల్, సోనియా..: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

త్యాగం అంటే రాహుల్,( Rahul Gandhi ) సోనియా గాంధీదని( Sonia Gandhi ) తెలిపారు.

గాంధీ కుటుంబంపై కావాలనే బీజేపీ ఆరోపణలు చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.కుట్రపూరితంగానే ఈడీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణలో వంద రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పామన్నారు.కానీ ప్రతిపక్షాలు యాభై రోజులు కూడా కాకముందే హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.అయితే ఆరు గ్యారెంటీల్లో( Six Guarantees ) రెండింటినీ అమలు చేశామని పేర్కొన్నారు.

మరో రెండింటినీ త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు.హామీల గురించి అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు