తన రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ పై భావోద్వేగంతో ట్వీట్ చేసిన సచిన్..!!

ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో విరాట్( Virat Kohli ) తన 50వ సెంచరీ చేయడం తెలిసిందే.

ఈ సెంచరీ తో సచిన్ పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసి వరల్డ్ లోనే అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

అయితే మ్యాచ్ లో సెంచరీ చేసిన అనంతరం.విరాట్ కోహ్లీ మైదానంలో మ్యాచ్ చూస్తున్న సచిన్ కి సలాం చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే తన రికార్డులను బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ పై సచిన్( Sachin Tendulkar ) ట్విటర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు."నిన్ను మొదటిసారి డ్రెస్సింగ్ రూమ్ లో చూశాను.

అప్పుడు మిగతా ఆటగాళ్లు నిన్ను ప్రాంక్ చేసి నా కాలు మొక్కేలా చేశారు.ఆ రోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను.

Advertisement

కానీ ఇప్పుడు నువ్వు నా హృదయాన్ని తాకావు.పట్టుదలతో, నైపుణ్యంతో నువ్వు "విరాట్" క్రీడాకారునిగా ఎదిగినందుకు ఎంతో సంతోషిస్తున్నా.

నా హోమ్ గ్రౌండ్ లో, అది ప్రపంచ కప్ సెమీ ఫైనల్( ICC World Cup ) లో నా రికార్డును బ్రేక్ చేసినందుకు.నాకు చాలా ఆనందంగా ఉంది" అని సచిన్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు