కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ! టీఆర్ఎస్ గూటికి సబితా ఇంద్రారెడ్డి?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుసగా షాక్ లు తగులుతున్నాయి.

ఇప్పటికి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా తీర్చిన వారిలో ముగ్గురు అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరడానికి రెడీ అయిపోయారు.

అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా బరిలో దిగాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమర శంఖారావం శనివారం రాహుల్ గాంధీ ప్రారంభించారు.

ఇంతలో ఆ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది.వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో హోం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆమె తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.శనివారం జరిగిన రాహుల్ గాంధీ సభలో కూడా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో సబితాఇంద్రారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

నేపథ్యంలో ఆమె తాజాగా కెసిఆర్తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.త్వరలో ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి తో కలిపి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సబిత సిద్ధమవుతుందని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Advertisement