చంద్రుడికి తుప్పుపట్టింది అని తేల్చి చెప్పిన నాసా!

అంతరిక్ష పరిశోధకులు తాజాగా ఓ బాంబు పేల్చారు.

అదేంటంటే మన సినిమా పాటలలో, కవితలలో ఎక్కువగా వినిపించే మన చందమామ పై తుప్పు ఉందని తేల్చి చెబుతున్నారు.

ఈ విషయాన్ని అంతరిక్షం నిపుణులు లేదా వ్యోమగాములు చెప్పలేదండి బాబు స్వయంగా నాసా చెప్పింది.ఓ అధ్యయనం ప్రకారం చంద్రుడిపై హేమలైట్ అనే రకం తుప్పు ఉందని స్పష్టం అయినట్లు నాసా ప్రకటించింది.

Rust On Moon,NASA, Scientists, NASA Scientist Reasearch, Rust, Without Oxygen A

అసలు వాతావరణమే లేని చంద్రుడిపై ఆక్సిజన్,నీరు కలిస్తే ఏర్పడే తుప్పు ఎలా ఏర్పడిందనే అంశంపై ప్రస్తుతం పరిశోధకులు దృష్టి సారించారు.ఈ నేపథ్యంలో భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 తీసుకొచ్చిన సమాచారాన్ని దీర్ఘంగా పరిశీలించిన హవాయి యూనివర్సిటీ పరిశోధకులు చంద్రుడి ఉపరితలంపై మంచు మరియు ఇతర ఖనిజాలు ఉన్నాయని ఐస్కాంత క్షేత్ర కారణంగా భూమి నుండి చంద్రుడి పై కొంతమేర ఆక్సిజన్ చేరుతుందని దీనివల్ల చంద్రుడి ఉపరితలంపై ఉండే మంచు కరిగి ఇనుము ఖనిజాలపై పడి తుప్పు ఏర్పడుతుండ వచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ తుప్పు కారణంగానే అంగారక గ్రహం మనకు ఎరుపురంగులో కనిపిస్తుందని వారు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

తాజా వార్తలు