ఉక్రెయిన్‎తో యుద్ధంపై రష్యా కీలక నిర్ణయం..!

రష్యా -ఉక్రెయిన్‎ల మధ్య గత కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశం కన్పిస్తోంది.

ఈ మేరకు యుద్ధాన్ని ఆపాలని రష్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దౌత్య పరమైన చర్చల ద్వారా వార్ కు ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.అయితే శత్రుత్వ తీవ్రత అనేక నష్టాలకు దారి తీస్తుందని ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా తాము చర్చలకు సిద్ధంగా ఉన్న ఉక్రెయిన్ మాత్రం సముఖత వ్యక్తం చేయడం లేదని వెల్లడించింది.మరోవైపు చర్చలు జరగాలి అంటే ముందుగా దాడులు ఆపాలని, తమ భూభాగాన్ని అప్పగించాలని ఉక్రెయిన్ చెబుతోంది.

అయితే ఉక్రెయిన్ కు తమ మద్ధతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు