'రుషివనంలో'.. మణిశర్మ క్లాసిక్ హిట్స్ లో చేరిపోవడం ఖాయం!

సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

విడాకుల తర్వాత పుష్ప ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.ఈ పాట తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.

బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.

చాలా రోజుల పాటు ఈమె దీనితో పోరాడి దీని నుండి బయట పడింది.ఇటీవలే ఈమె నటిస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సెట్స్ లో చేరింది.

Advertisement

ఇదిలా ఉండగా ఈమె నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.ఈ సినిమాను ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కింది.మరి రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా చేయడానికి సిద్ధం అవుతున్నారు.తాజాగా మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు.

రుషివనంలోనా. అనే రెండవ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేయగా.

ఇది మణిశర్మ క్లాసిక్ బాణీల్లో ఒకటిగా నిలిచి పోతుంది అనేలా ఆహ్లాదంగా సాంగ్ సాగుతుంది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

చిన్మయి, సిద్ శ్రీరామ్ అద్భుతమైన గానం ఎంతో ఆహ్లాదకంగా లయబద్ధంగా ఉండడంతో ఈ పాట ఎంతో బాగా ఆకట్టు కుంటుంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ కూడా బాలనటిగా పరిచయం కాబోతుంది.అలాగే ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

చూడాలి ఈ సినిమాతో సామ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో.

తాజా వార్తలు