పరిగెత్తించి కొడతా ! జేసీపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫైర్

నేను ఎమ్మెల్యే కనుక కాకపోతే తాడిపత్రి ( Tadipatri )పురవీధులను పరిగెత్తించి కొడతా అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రాఫ్ ఇన్సూరెన్స్ అందరి రైతులకు వచ్చినట్లే నా పంటకూ భీమ వచ్చింది.

జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదు కాబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని పెద్ద రెడ్డి మండిపడ్డారు.నేను ఎమ్మెల్యే కావడం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) పెట్టిన బిక్ష.

నీకు దమ్ముంటే నా పొలాల్లో కాళ్లు పెట్టి చూడు కదా వేరేలా ఉంటుంది అంటూ ప్రభాకర్ రెడ్డిని పెద్దారెడ్డి( Peddareddy ) హెచ్చరించారు.ఎమ్మెల్యేలకు పొలాలు ఉండకూడదా ? ఇన్సూరెన్స్  రాకూడదా అంటూ ప్రశ్నించారు.దొంగతనాలు చేసే కుటుంబం నీది.

నాది నీతి నిజాయితీగల కుటుంబం.స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని తిట్టినప్పుడు నీ మీద ప్రజలు సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెట్టారో గుర్తుచేసుకో.

Advertisement
Run And Beat! MLA Peddareddy Fire On JC, Jc Prabhakarareddy, Kethireddy Peddared

సిఐలు, ఎస్ఐలను నోటికొచ్చినట్లు తిడతావ్.నువ్వు చచ్చిపోతే తాడిపత్రికి పట్టిన దరిద్రం పోతుంది అంటూ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Run And Beat Mla Peddareddy Fire On Jc, Jc Prabhakarareddy, Kethireddy Peddared

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డికి సవాల్ చేశారు .జెసి ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy )అంత పనికిమాలిన వ్యక్తిని ఈ రాష్ట్రంలో నేను ఎవరిని చూడలేదు.పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో మగాడు అనేవాడు ఉంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు నా తోటలో అడుగుపెట్టి చుడండి అంటూ సవాల్ చేశారు.

నాకు ఈ ఎమ్మెల్యే పదవి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన బిక్ష.ఈ పదవి కనుక లేకపోతే ప్రభాకర్ రెడ్డిని ఇంటిలో నుంచి లాక్కుని వచ్చి చెప్పు తీసుకొని కొట్టి, తాడిపత్రి పట్టణమంతా ఊరేగిస్తానంటూ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి ఫైర్ అయ్యారు.

నేను కొడితే సానుభూతి వస్తుందని జెసి ప్రభాకర్ రెడ్డి ఆలోచిస్తున్నాడని పెద్దారెడ్డి విమర్శించారు.

Run And Beat Mla Peddareddy Fire On Jc, Jc Prabhakarareddy, Kethireddy Peddared
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

అసలు ఈ వివాదం రావడానికి కారణం ఏమిటంటే, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( Tadipatri MLA Ketireddy Peddareddy ) ఏడాదిన్నర చీనా తోటకు పంట బీమా డబ్బులు కొట్టేసారని ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడంతో పాటు, ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.ఇదే విషయంపై మీడియా సమావేశం నిర్వహించి మరీ, పంటల బీమాలో రైతులకు న్యాయం జరగలేదని, వైసీపీ నాయకులకి న్యాయం జరిగిందని, క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కొట్టేసారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.ఎమ్మెల్యే పెద్దారెడ్డి చీనా తోటకు వస్తున్నా, దమ్ముంటే ఆపండి అంటూ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు.

Advertisement

ఈ సవాల్ పైనే పెద్దారెడ్డి స్పందిస్తూ ప్రభాకర్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు