మహానాయకుడు మూలన పడ్డట్లేనా.. షాకింగ్‌ ప్రచారం

ఎన్టీ రామారావు బయోపిక్‌ మొదటి పార్ట్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఆ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్నా కూడా పెద్దగా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది.

దాంతో రెండవ పార్ట్‌పై నీలి నీడలు మ్ముకున్నాయంటూ ప్రచారం జరుగుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం షూటింగ్‌ జరుగుతుంది.

కాని కొందరు మాత్రం మహానాయకుడు చిత్రాన్ని మూలన పెట్టేశారని, అసలు సినిమా విడుదల చేసే ఆలోచన బాలకృష్ణకు లేదని ప్రచారం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రం సమయంలోనే మహానాయకుడు సినిమా రైట్స్‌ను అమ్మేశారు.ఇప్పుడు ఆ అడ్వాన్స్‌లను నిర్మాత బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేస్తున్నట్లుగా చెబుతున్నారు.కథానాయకుడు సినిమా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో మహానాయకుడు వచ్చి పరువు తీస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుందట.

Advertisement

అందుకే ఈ చిత్రంను వద్దనుకుంటున్నట్లుగా బాలకృష్ణ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.మహానాయకుడు సినిమా విడుదల కాదంటూ కొందరు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు.

ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.మహానాయకుడు సినిమా కథానాయకుడును మించి ఉంటుందని, రెండవ పార్ట్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లో చాలా కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రథయాత్ర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.పరీక్షల సీజన్‌లో సినిమా విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.