గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాల గురించి తెలుసా?

హిందూ సంప్రదాయం లో భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక ఆచారం.శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

భగవంతుని నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి.రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.

కొబ్బరి కాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది.సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని మన పెద్దలు అంటారు.

కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు.కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది.

Advertisement

అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు.దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు.

ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది.కొబ్బరికాయ కొట్టి దానిని విడదీయకుండా తీసుకువచ్చి అభిషేకం చేస్తారు చాలామంది.

ఈ విధంగా చేయటం చాలా తప్పు.అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు.

కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి.పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
బట్టల మీద ఎలాంటి మరక పడిన ఈ విధంగా చేస్తే మళ్ళి కొత్త వాటిలాగా మెరుస్తాయి

వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

Advertisement

తాజా వార్తలు