బాహుబలి 2 కోసం రూల్స్ బ్రేక్‌

బాహుబ‌లి సినిమా దేశ‌వ్యాప్తంగా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే.బాహుబ‌లి ది బిగినింగ్ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.

600 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి దేశ‌వ్యాప్తంగా ఓ ట్రెండ్ సెట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు కంటిన్యూగా వ‌స్తోన్న బాహుబ‌లి 2పై కూడా ఇండియా వ్యాప్తంగా అన్ని భాష‌ల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి.

బాహుబ‌లి 2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.ఓ భాష‌లో సూప‌ర్ హిట్ అయిన సినిమాను ఇత‌ర భాష‌ల్లోకి డ‌బ్ చేసి రిలీజ్ చేయ‌డం కామ‌న్‌.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదమవుతుంటాయి.అలా రిలీజ్ అయిన సినిమాలు సూప‌ర్ హిట్ కూడా అయ్యాయి.ఉదాహ‌ర‌ణ‌కు బాహుబ‌లి సినిమానే తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్‌, మ‌ళ‌యాళ భాష‌ల్లోకి డ‌బ్ అన్ని భాష‌ల్లోను సూప‌ర్ హిట్ అయ్యింది.

Advertisement

అయితే ఏ భాష‌లో సినిమా అయినా మ‌రో భాష‌లోకి అనువాదం అవ్వ‌డం కామ‌న్‌.అయితే ఇలాంటి డ‌బ్బింగ్‌కు క‌న్న‌డ ఇండ‌స్ట్రీ మాత్రం ఆమ‌డ దూరంలో ఉంటోంది.

ఓ భాష‌లో హిట్ అయిన సినిమాలు క‌న్న‌డ భాష‌లోకి అనువాదం చేయ‌డం అక్క‌డ నిబంధ‌న‌లు అంగీక‌రించ‌వు.క‌న్న‌డంలో ఇత‌ర భాష‌ల సినిమాలు రిలీజ్ చేయాల్సి ఉంటే వాటిని ఒరిజిన‌ల్ భాష‌లోనే రిలీజ్ చేయాలి త‌ప్ప క‌న్న‌డ భాష‌లోకి అనువాదం చేయ‌డం కుద‌ర‌దు.

కన్న‌డ ఇండ‌స్ట్రీని కాపాడుకునేందుకు అక్క‌డ ఎప్ప‌టి నుంచో ఈ రూల్ పాటిస్తున్నారు.అయితే బాహుబ‌లి 2 కోసం ఆ రూల్స్ మార్చే ప‌నిలో ఉన్నార‌ట‌.

బాహుబ‌లి 2ను క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేసేందుకే ఈ సినిమాను అక్క‌డ డిస్ట్రిబ్యూట‌ర్స్ క‌న్నడ భాష‌లోకి అనువాదం చేసేలా అక్క‌డ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌పై ఒత్తిడి చేస్తున్నార‌ట‌.అయితే ఈ రూల్స్‌ను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ ఎంత వ‌ర‌కు బ్రేక్ చేస్తుందో ? చూడాలి.

రావు గోపాల్ రావు ని చూసి క్లీనర్ అనుకున్న కోట శ్రీనివాస రావు
Advertisement