ఓరి మీ దుంప తెగ.. ఎక్స్‌ట్రా స్పూన్ అడిగినందుకే రూ.88 ఛార్జ్..!!

సాధారణంగా కపుల్ బయటికి వెళ్ళినప్పుడు డెజర్ట్ లాంటిది ఏదైనా తిని ఆస్వాదిస్తారు.చాలామందికి ఐస్‌క్రీం అంటే ఇష్టముంటుంది.

రొమాంటిక్‌గా ఉంటుందని ఒకే కప్పు ఐస్ క్రీమ్‌ను దంపతులు షేర్ చేసుకోవడం కామన్.ఇటీవల ఒక మహిళ అలాంటిదే చేసింది, కానీ రెస్టారెంట్ ఇచ్చిన షాక్ కి ఆమెకు మతిపోయింది.

ఆ మహిళ పేరు కైరా ( Chiara ).ఇటలీకి టూరిస్ట్ గా వచ్చిన ఆమె రీసెంట్‌గా లావిస్ అనే నగరంలోని జెలటేరియా సెరాఫిని( Gelateria Serafini ) అనే ఓ ఐస్‌క్రీం షాప్‌కి వెళ్లింది.అక్కడ ఒక కప్పు ఐస్ క్రీమ్‌ తీసుకుంది, దానిని తన హస్బెండ్ తో షేర్ చేసుకోవాలనుకుంది.

అందుకోసం రెస్టారెంట్ సిబ్బందిని ఒక ఎక్స్‌ట్రా స్పూన్ అడిగింది.దానికి కూడా డబ్బులివ్వాల్సి వచ్చేసరికి ఆమె షాక్ అయ్యింది.నిజానికి అది ఒక డిస్పోజబుల్ స్పూన్.

Advertisement

ఐస్ క్రీం ధరను 8 యూరోలు (సుమారు రూ.704) అయితే రెస్టారెంట్ సిబ్బంది ఆమెకు 9 యూరోలు అంటే రూ.792 బిల్లు ఇచ్చారు.ఇందులో, ఆమె అడిగిన అదనపు డిస్పోజబుల్ స్పూన్‌కి 1 యూరో అంటే దాదాపు రూ.88 ఛార్జ్ చేశారు.బిల్లు చూసి సదరు మహిళా ఇదేంటి ఇట్లా కస్టమర్ల నుంచి దోచేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతరం ట్రిప్‌అడ్వైజర్‌లో రెస్టారెంట్‌పై నెగిటివ్‌గా రివ్యూలు ఇచ్చింది.ఈ రెస్టారెంట్‌కు వెళ్తే జేబుకు చిల్లే అన్నట్లు ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇలాంటి దోపిడీ జరగడం ఇది తొలిసారి ఏమీ కాదు.ఇంతకు ముందు కూడా, ఒక రెస్టారెంట్ కేక్ కట్ చేయడానికి కస్టమర్ నుంచి ఏకంగా 16 డాలర్లు (దాదాపు రూ.1300) వసూలు చేసింది.మరో రెస్టారెంట్ సిబ్బంది శాండ్‌విచ్‌ను సగానికి కట్ చేసినందుకుగాను 2 యూరోలు అంటే రూ.176 వసూలు చేసి షాక్ ఇచ్చింది.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు