గూగుల్‌కు రూ.700 కోట్ల ఫైన్.. కారణమదే!

ప్రపంచ దిగ్గజ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్, మ్యాప్‌లు( Google ) లోకేషన్-ఆధారిత సర్వీసులను మెరుగుపరచడం, కొత్త ప్రొడక్టుల ఫీచర్‌లను అభివృద్ధి చేయడం వంటి సర్వీసులు ఇస్తున్న క్రమంలో ఎల్లప్పుడూ లొకేషన్ యాక్సెస్ ద్వారా యూజర్లను ట్రాక్ చేస్తూ వుంటుందనే విషయం మీలో కొంతమందికి తెలిసే వుంటుంది.

ఈ క్రమంలోనే కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్టు గురించి నిమిషాల్లో అనేక యాడ్స్ డిస్‌ప్లే చేస్తుంది గూగుల్.

అంతేకాకుండా ఇంటర్నెట్ అంతటా వివిధ కారణాల వల్ల గూగుల్ తన యూజర్లను ట్రాక్ చేస్తుంది.

అయితే, యూజర్లు ట్రాకింగ్‌( Tracking users )ను ఆఫ్ చేసుకుంటే మాత్రం లొకేషన్‌ను ట్రాక్ చేయదని గూగుల్ ఎల్లప్పుడూ స్పష్టం చేస్తూ వుంటుంది.అయితే, ఇక్కడే అసలు కిటుకు వుందని నిపుణులు చెబుతున్నారు.అవును, గూగుల్ వ్యతిరేకంగా ఇటీవల దాఖలు చేసిన దావాలో యూజర్ల లొకేషన్ డేటా, ఎలా? ఎప్పుడు ట్రాక్ చేస్తుంది? స్టోరేజీ అవుతుందని కంపెనీ యూజర్లను తప్పుదారి పట్టించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ ఆరోపణలో భాగంగా సెటిల్‌మెంట్‌లో భాగంగా.

గూగుల్ 93 మిలియన్ డాలర్లు చెల్లించనుంది.అంటే.దాదాపు రూ.7వేలు కోట్లు అని ది గార్డియన్ నివేదించింది.

Advertisement

వివరాల్లోకి వెళితే, కాలిఫోర్నియా( California ) అటార్నీ జనరల్ రాబ్ బొంటా దాఖలు చేసిన దావా ప్రకారం.యూజర్ల లొకేషన్ డేటాపై ఎక్కువ కంట్రోల్ కలిగి ఉన్నారని ఓ తప్పుడు అభిప్రాయాన్ని అందించడం ద్వారా కంపెనీ యూజర్లను మోసం చేసిందని బట్టబయలు అయింది.గూగుల్ యూజర్లకు.

యూజర్ యాక్టివిటీ ఆప్షన్ స్టాప్ చేస్తే.ఇకపై వారి లొకేషన్ ట్రాక్ చేయదని తెలిపింది.

కానీ, దీనికి విరుద్ధంగా సొంత వాణిజ్య లాభం కోసం యూజర్ల కదలికలను ట్రాక్ చేయడం కొనసాగిస్తుందని బొంటా గార్డియన్‌కు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలోనే గూగుల్ దానికి మూల్యం చెల్లించుకుంది.

ఈ రాశుల వారికి పచ్చ రత్నం కలిసి రాదా..?
Advertisement

తాజా వార్తలు