#RRR@రూ.900 కోట్లు.. ఇండియన్‌ సినిమా కనీవినీ ఎరుగని మొత్తం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా బిజినెస్ ఆకాశమే హద్దు అన్నట్లుగా సాగుతోంది.

ఈ సినిమా ను దానయ్య దాదాపుగా 400 కోట్లతో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా విడుదలకు ముందే దాదాపుగా 900 కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తుందని అంటున్నారు.సినిమా సక్సెస్‌ అయితే దాయ్యకు ఇప్పటికే వచ్చిన రూ.500 కోట్ల లాభంతో పాటు మరి కొంత మొత్తం కూడా యాడ్‌ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ చరిత్రలో ఏ ఒక్క సినిమా కూడా ఇంత భారీ మొత్తంలో బిజినెస్‌ చేయలేదు అనేది వాస్తవం.

Rrr Pre Release Business Massive 890cr All Time Record-#RRR@రూ.900 కో�

బాహుబలి 2 సినిమా మరియు 2.ఓ సినిమా లు కాస్త భారీగానే బిజినెస్‌ చేసినా కూడా ఇది మాత్రం అంతకు మించి అంటున్నారు.బాలీవుడ్‌ సినిమా లు ఇంతకు మించిన బడ్జెట్‌ తో రూపొందినవి కూడా 500 కోట్ల రూపాయల వరకు ఆగిపోయాయి.

కాని ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా మాత్రమే 900 కోట్ల రూపాయలను బిజినెస్‌ చేసిందని అంటున్నారు.జక్కన్న పై ఉన్న నమ్మకంతో అన్ని ఏరియాల్లో కూడా భారీగానే ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు వచ్చారు.ఇప్పటికే ఈ సినిమా ఏపీలో 165 కోట్లకు, నైజాం ఏరియాలో రూ.75 కోట్లకు, తమిళనాడు రూ.48 కోట్లకు, నార్త్‌ ఇండియా 140 కోట్లకు , కర్ణాటక 45 కోట్లకు, కేరళ 15 కోట్లకు, ఓవర్సీస్‌ 70 కోట్లకు అమ్ముడు పోయిందని వార్తలు వస్తున్నాయి.థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఇప్పటికే సినిమా 570 కోట్ల రూపాయలను దక్కించుకుంది.ఇక ఓటీటీ రైట్స్‌ కు గాను రూ 170 కోట్లు, శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా 130 కోట్ల రూపాయలు, మ్యూజిక్‌ రైట్స్ కు 20 కోట్లు రాబట్టడం ద్వారా సినిమా మొత్తంగా దాదాపుగా రూ.890 కోట్ల రూపాయలను బిజినెస్‌ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు