ఆర్ఆర్ఆర్ మ్యానియాలో కొట్టుకుపోయిన జాన్ అబ్రహం.. దిమ్మతిరిగేలా ఎటాక్ ఓపెనింగ్స్..

టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.

ఈయన మన తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కు మార్చేశాడు.

దేశం మొత్తం మన సినిమాల వైపే చూస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మన సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద విలవిలా లాడిపోతున్నాయి.

ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఆసక్తి చూపని అక్కడి ప్రేక్షకులు సైతం మన సినిమాల కోసం ఎదురు చుస్తున్నారు.మన సినిమాల రిలీజ్ డేట్ లను చూసి హిందీ మేకర్స్ వాళ్ళ సినిమాల రిలీజ్ డేట్ లను మార్చుకుంటున్నారు.

ఎందుకంటే సౌత్ సినిమాలతో పోటీగా వస్తే అవి మన ధాటికి తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నాయి.అయితే ఇలా మన సౌత్ మూవీలు వాళ్ళ సినిమాలపై ఆధిపత్యం చెలాయించడం వాళ్లకు మింగుడుపడని విషయంగా మారింది.

Advertisement

దీంతో మన సినిమాలపై ఇండైరెక్ట్ సెటైర్స్ వేస్తున్నారు.రీసెంట్ గా బాలీవుడ్ కి చెందిన జాన్ అబ్రహం మన సినిమాలపై రీజనల్ సినిమాలు అంటూ కామెంట్ చేయడం వైరల్ గా మారింది.అయితే ఈయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యింది.

ఇప్పుడు అదే రీజనల్ సినిమా ఆయన నటించిన ఎటాక్ పార్ట్ 1 పై ప్రభావం చూపించి అతడికి షాక్ ఇచ్చింది.జాన్ అబ్రహం స్వీయ నిర్మాణంలో రూపొందిన ఎటాక్ సినిమా నిన్న ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్స్ అతడికి దిమ్మతిరిగి పోయేలా వచ్చాయి.

ఈ సినిమాకు మొదటి రోజు 3 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.అయితే ఇదే రోజు ఆర్ ఆర్ ఆర్ సినిమాకు 13 కోట్ల షేర్ రాబట్టింది.దీంతో బాలీవుడ్ హీరోలకు దిమ్మతిరిగి పోయింది.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

ఆర్ ఆర్ ఆర్ మ్యానియా తన సినిమాపై ప్రభావం ఏ రేంజ్ లో చూపించిందో ఇక్కడే అర్ధం అయ్యింది.ఈ మ్యానియాతో జాన్ అబ్రహం సినిమా కొట్టుకు పోయింది.

Advertisement

ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

తాజా వార్తలు