ఆర్ఆర్ఆర్ జపాన్ టూర్.. ఆ ముగ్గురు స్టార్స్ భార్యల ఫోటోలు వైరల్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా ఇటీవలే విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

కాగా ఇందులో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లో కలిసి నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించి రికార్డుల స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అంటే నేడు అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.ఆర్ఆర్ఆర్ సందర్భంగా జపాన్ కు చేరుకున్నారు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.

వారితో పాటు వారి భార్యలు కూడా జపాన్ కి చేరుకున్నారు.కాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు ఆర్ఆర్ఆర్ త్రయం భార్యలు.

Advertisement

ఎన్టీఆర్ భార్య ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన, అలాగే రాజమౌళి భార్య రమా కూడా జపాన్ లో సందడి సందడి చేశారు.

ఈ నేపథ్యంలోనే రమా, ప్రణతి, ఉపాసన కలిసి ఫోటోలు దిగారు.అయితే ఇప్పటి వరకు మనం కేవలం ఆర్ఆర్ఆర్ త్రయాన్ని మాత్రమే చూడగా ఇప్పుడు కొత్తగా త్రయం భార్యలు ఒకే చోట కలవడం అన్నది మొదటిసారి.రమా,ప్రణతి, ఉపాసన కలిసి దిగిన ఫోటోని ఉపాసన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి కొడుకు అతని భార్య కూడా పాల్గొన్నారు.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు