మెగా ఫ్యామిలీ పై పగ పట్టేసిన రోజా..!

పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం సభలో తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు.

అలాగే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది వ్యాఖ్యలపై స్పందించాలని రోజాను మీడియా కోరగా, రోజా తనదైన శైలిలో స్పందించింది.

“వారంతా చిన్నవారు.చిన్న చిన్న ప్రదర్శనలు, చిన్న పాత్రలు చేస్తుంటారు.

ఎవరి కోరిక మేరకు వారు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారన్నది ముఖ్యం.మెగా ఫ్యామిలీలో 6 నుంచి 7 మంది హీరోలు ఉన్నారు.

కాబట్టి, వారిపై, లేదా వారికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నా సినిమా పరిశ్రమలో పని కోల్పోతారు’ అని రోజా అన్నారు.మెగా ఫ్యామిలీని ఆదరిస్తున్న వారు భయంతో చేస్తున్నారే తప్ప ఆప్యాయతతోనో, ప్రేమతోనో కాదని చెప్పింది రోజా.

Advertisement

MAA ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ఓటమిని కూడా రోజా ఈ సందర్భంగా ప్రస్తావించడం గమనార్హం.“మెగా కుటుంబం మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు?

అందుకే మెగా ఫ్యామిలీతో ఉన్న వాళ్లంతా భయంతో వాళ్లతో ఉన్నారు.కానీ కుటుంబం నుండి వచ్చే ఆప్యాయత వల్ల కాదు.అందుకే వాళ్ళ క్యాండిడేట్ ను వారు గెలిపించుకొలేకపోయారు,” అని చెప్పింది రోజా.

మంత్రి రోజా అక్కడితో ఆగలేదు.ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారి తీరు మార్చుకోవాలని ఆమె హెచ్చరించారు.

అలా మాట్లాడే ముందు పునరాలోచించుకోవాలని ఆమె కోరారు.“సొంత శాఖలు తెలియకుండా,

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అవగాహన లేకుండా మంత్రులు మంత్రులు అవుతారా? మీకు జ్ఞానం లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా చేయలేదు.తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ ఓటమిని రోజా టార్గెట్ చేశారు.ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన నటీనటులలో కోట శ్రీనివాసరావు, శారద, బాబూ మోహన్ వంటి వారం మేమే అని ఉదాహరణలను కూడా ఆమె ఇవ్వడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు