సాకారమవుతున్న రోహిత్ కల

రోహిత్ వేముల ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటిలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి.

ఇతని ఆత్మహత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిందే.ఇక అసలు విషయం ఏమిటంటే.

ఆర్థికంగా వెనుకబడి ఉన్న రోహిత్ కుటుంబానికి సొంత ఇల్లు (పక్కా ఇల్లు) సమకూరబోతున్నది.ఇది ప్రభుత్వం కట్టిస్తున్న ఇల్లు కాదు.

ఈ కుటుంబానికి ఇప్పటివరకు చిన్న రేకుల గది మాత్రమే ఉంది.సొంత ఇల్లు నిర్మించాలన్న రోహిత్ ఆ పని చేయకుండానే వెళ్ళిపోయాడు.

Advertisement

దీంతో అతని కల నెరవేర్చడానికి కొందరు ముందుకు వచ్చారు.గుంటూరుకు దగ్గరలోని కొప్పురావూరు గ్రామంలో 20 లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆలిండియా ముస్లీం లీగ్ కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు.

ఇందుకు అవసరమైన 160 గజాల జాగాను ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఏపీ ఐ ఏ యస్, ఐ పీ ఎస్ అధికారుల సంఘం సభ్యులు.సొంత ఇల్లు కట్టిస్తానని రోహిత్ ఎప్పుడూ చెప్పేవాడని, కానీ ఆ కల తీరకుండానే అతను ప్రాణాలు వదిలాడని రోహిత్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పుడు పెద్ద మనసుతో ఇల్లు కట్టిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Advertisement