టెస్ట్ ఫార్మేట్ క్రికెట్ పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

ప్రస్తుతం భారత్ టీం దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే.మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి చెందింది.

రేపటి నుండి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) టెస్ట్ ఫార్మేట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

టెస్ట్ క్రికెట్ భవితవ్యం పై మాట్లాడుతూ.టెస్ట్ ఫార్మేట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే ఇది ఒకటి రెండు దేశాలతో సాధ్యం కాదని టెస్ట్ ఆడే దేశాలన్నీ బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.అభిమానులను అలరించాల్సిన బాధ్యత క్రికెటర్ల పై ఉందని కూడా రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.

Rohit Sharma Key Comments On Test Cricket, Rohit Sharma, Test Cricket Format, A
Advertisement
Rohit Sharma Key Comments On Test Cricket, Rohit Sharma, Test Cricket Format, A

కొద్ది రోజుల క్రితం ఇవే వ్యాఖ్యలను మాజీ క్రికెటర్ ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్( Australian player Steve ) వా కూడా అన్నారు.ఐసీసీ, బీసీసీఐ సహా ప్రపంచ బోర్డులు టెస్ట్ ఫార్మేట్ నీ పరిరక్షించాలని పిలుపునిచ్చారు.కాగా తాజాగా ఇప్పుడు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మేట్ పై కామెంట్లు చేయటం సంచలనంగా మారింది.

ఒకప్పుడు టెస్ట్ ఫార్మేట్ మ్యాచ్ లకి జనాలు ఎగబడి చూసేవారు.అయితే ఎప్పుడైతే "2020" మ్యాచ్ లు ప్రారంభమయ్యాయో టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తి మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది.

టెస్ట్ మ్యాచ్ చూడటానికి కూడా ప్రేక్షకులు సమయానికి కేటాయించలేని పరిస్థితి నెలకొంది.దీంతో కొన్ని దేశాలు టెస్ట్ మ్యాచ్ లని పూర్తిగా నిషేధించే విధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

అయితే కొందరు మాజీ ఆటగాళ్లు ప్రస్తుతం ఆడుతున్న స్టార్ ప్లేయర్స్ టెస్ట్ మ్యాచ్ ఫార్మేట్ కాపాడాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు.

స‌మ్మ‌ర్‌లో రోజుకో గ్లాస్ ల‌స్సీ తాగితే..మ‌స్త్‌ బెనిఫిట్స్‌!
Advertisement

తాజా వార్తలు