అలియా భట్, రణ్‌వీర్ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ.
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.విడుదల అయినా ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.కాగా ఈ మూవీకు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్( Karan Johar ) తెరకెక్కించారు.
అయితే ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్.( Actress Anjali Anand ) రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ.తాను కూడా బాడీ షేమింగ్‌కు( Body Shaming ) గురైనట్లు ఆమె తెలిపింది.
బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్‌లో చేరినప్పుడు తనను శరీర బరువును కించపరిచే విధంగా కొందరు మాట్లాడారని ఆమె తెలిపింది.తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది.
తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్, విమర్శలు చేశారని ఆమె చెప్పుకొచ్చింది.
కాగా ఈమె ధై కిలో రెమ్, కుల్ఫీ కుమార్ బజేవాలా( Kulfi Kumar Bajewala ) వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది.కుల్ఫీ కుమార్ బజేవాలా సినిమాలో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది.కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది.
లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండచ్చు అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి తెలిపింది.అయితే అంజలి ఆ వాఖ్యల గురించి స్పందిస్తూ.
ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy