అబ్బో .. రోబో ! న్యూస్ రీడర్ అవతారం ఎత్తేశాయ్ !

న్యూస్ ఛానెల్స్ కు పెనుభారం తప్పబోతోంది.ఇప్పటివరకు వార్తలు చదివేందు ప్రతి ఛానెల్ నలుగురైదుగురు న్యూస్ రీడర్స్ ను పెట్టుకుని వార్తలు చదివిస్తోంది.

అయితే వీరికి జీతభత్యాల కింద భారీగా ఖర్చు చేస్తున్నాయి.అయితే ఇదంతా వేస్ట్ అనుకుందో ఏమో కానీ .చైనాకు చెందిన జిన్హువా అనే ఛానల్ యాజమాన్యం ఖర్చులు తగ్గించి, సామర్ధ్యాన్ని పెంచేలా ఓ రోబోట్ పై ప్రయోగం చేశారు.ఈ ప్రయోగం ద్వారా 365 రోజులు 24 గంటల పాటు మనిషి మాదిరిగానే వార్తలు చదివేలా రోబోట్ ఏఐ న్యూస్ యాకర్ ను జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ, చైనా సెర్చ్‌ ఇంజిన్‌ సొగోవ్‌.

కామ్‌ సంయుక్తంగా తయారుచేయించాయి.

తూర్పు చైనాలోని ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లో జరుగుతున్న ప్రపంచ ఐదో ఇంటర్నెట్‌ సదస్సులో ఈ ఏఐ న్యూస్‌ యాంకర్‌ను అందుబాటులోకి తెచ్చాయి.మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ ద్వారా దీన్ని అభివృద్ధి చేశారు.ఎలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి, వార్తలకు అనుగుణంగా ముఖ కవళికలను ఎలా మారుస్తూ భావోద్వేగాలను వ్యక్తపరచాలి తదితర అంశాల్లో ఈ న్యూస్ రీడర్‌కు శిక్షణ ఇచ్చారు.

Advertisement

ఖర్చు తగ్గించుకోవడం, సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కృత్రిమ మేధను ఉపయోగించుకుంటున్నాం అని జిన్హువా ఛానల్‌ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.

కృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీ చుట్టాలున్నారు జాగ్రత్త.. !
Advertisement

తాజా వార్తలు