రోబోటిక్ వేలు ఇన్వెంట్‌ చేసిన శాస్త్రవేత్తలు.. దీని ఉపయోగాలు తెలిస్తే..

మానవులు 21వ శతాబ్దంలో, కృత్రిమ మేధస్సు( AI ), ఆగ్మెంటెడ్ రియాలిటీ( AR ) వంటి టెక్నాలజీలలో అద్భుతమైన పురోగతి సాధించారు.

స్పేస్ఎక్స్, గూగుల్, ఫేస్‌బుక్, ఓపెన్ఏఐ వంటి పెద్ద కంపెనీలు ఈ రంగంలో ముందున్నాయి, మన జీవన విధానాన్ని మార్చే కొత్త ఉత్పత్తులను సృష్టిస్తున్నాయి.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ( University of Cambridge ) తాజాగా ఈ టెక్నాలజీలను ఉపయోగించుకొని ప్రోస్థెటిక్స్ రంగంలో ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ చేసింది.ఆ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన "థర్డ్ థంబ్" ( Third Thumb ) అనే రోబోటిక్ బొటనవేలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ 3D-ప్రింటెడ్ డివైజ్ ఒకే చేతితో మరిన్ని పనులు సమర్థవంతంగా చేయడానికి ప్రజలకు సహాయపడుతుంది.దీనిని తొడుక్కుంటే ఒక ఎక్స్‌ట్రా థంబ్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది కాబట్టి దీనిని థర్డ్ థంబ్ అని పిలుస్తారు, ఇది రోజువారీ పనులను సులభతరం చేయగలదు.

థర్డ్ థంబ్ అనేది నిజమైన బొటనవేలుకు వ్యతిరేకంగా చేతికి అవతలి వైపు ధరించే రోబోటిక్ డివైజ్.ఇది పెద్ద బొటనవేళ్ల కింద ఉంచిన ఒత్తిడి సెన్సార్లతో పనిచేస్తుంది.

Advertisement
Robotic Third Thumb Tested By Cambridge University Make One-handed Task Easier D

బొటనవేలుతో కిందికి నొక్కినప్పుడు, బొటనవేలు కదులుతుంది, వదిలివేసినప్పుడు, అది ప్రారంభ స్థానానికి తిరిగి వస్తుంది.

Robotic Third Thumb Tested By Cambridge University Make One-handed Task Easier D

ఈ డిజైన్ రెండు చేతులు అవసరమయ్యే పనులను, ఒకే చేతితో చేయడానికి ప్రజలకు అనుమతిస్తుంది.ఉదాహరణకు, ఒక సీసాను తెరవడం లేదా పండు తొక్క తీయడం వంటివి.పరిశోధకులు థర్డ్ థంబ్ ను చాలా త్వరగా నేర్చుకోవచ్చని కనుగొన్నారు.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 596 మంది పాల్గొన్న ఒక అధ్యయనంలో, పార్టిసిపెంట్లు కేవలం కొన్ని నిమిషాల్లోనే దీన్ని అలవాటు చేసుకున్నారు.

Robotic Third Thumb Tested By Cambridge University Make One-handed Task Easier D

థర్డ్ థంబ్ ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ టీమ్, ప్రొఫెసర్ తమర్ మకిన్, డిజైనర్ డాని క్లోడ్ సహా, ఒక చేయి కోల్పోయిన వారికి సహాయం చేయడానికి సృష్టించారు.యంత్రాలు మన రోజువారీ జీవితంలో మరింత కనెక్ట్ అవుతున్నందున, ఈ టెక్నాలజీ( Technology ) మానవుడిగా ఉండటం అంటే ఏమిటో రీడిఫైన్ చేస్తుందని వారు నమ్ముతారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు