అవును .కాంతారా హీరో రిషబ్ శెట్టి కి ముందుండి ముసళ్ల పండగ.
సినిమాలు తీయడం వేరు.కాంతారా సినిమా తర్వాత తీయబోయే సినిమా వేరు.
తన సినిమాతో తానే ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్నాడు.దర్శకుడిగా, హీరోగా, కథకుడిగా ఆయనకు ఆయనే టార్గెట్.
పెట్టిన 15 కోట్లు ఎక్కడ వస్తున్న వందల కోట్ల వసూళ్లు ఎక్కడ.కాంతారా అతి పెద్ద హిట్.
ఇక్కడ వరకు అంత బాగానే ఉంది.కానీ ఇక పైన ఎలాంటి కథతో తీసిన కూడా కాంతారా తో పోల్చి చూస్తారు.
తీసిన ప్రతి సినిమా కాంతారా అయితే కాలేదు కదా.ఒకసారి ఆలా అన్ని కుదిరాయి కాబట్టి కాంతారా మనకు దక్కింది.ఇకపైన తీసే సినిమా కాంతారా ని మించి ఉండాలి.
ఎంత మంచి సినిమా తీసిన దాన్ని మించి ఒక సినిమా కావలి.కాంతారా ని మించిన మరొక సినిమా తీస్తే తప్ప ప్రేక్షకుల అభిమానాన్ని అందుకోవడం కష్టం.
అయితే ఇలాంటి అగ్నిపరీక్షలు ఎదుర్కోవడం కేవలం రిషబ్ శెట్టి లాంటి వ్యక్తికి మాత్రమే కాదు.ఇప్పటి వరకు సూపర్ హిట్టు కొట్టిన అనేక మందికి ఇలాంటి పరిస్థితే వచ్చింది.
జక్కన్న లాంటి దర్శకుడు సైతం ఒక పెద్ద హిట్టు దొరికితే ఆకాశం తేలుతూ ఉంటాం కానీ ఆ తర్వాత ఒక చిన్న సినిమా తీసి మళ్లి నేల మీదకు రావాలి అని చెప్తూ ఉంటారు.అప్పుడే జనాలు ఇచ్చే ప్రెజర్ నుంచి బయట పడగలరు.
గతంలో కృష్ణ లాంటి హీరో అల్లూరి సినిమా తీస్తే ఎంతో పెద్ద హిట్ అయ్యింది.కానీ ఆ తర్వాత 8 సినిమాల వరకు అతడిపై మరింత అంచలనాలు పెరిగిపోయి విజయం పలకరించలేదు.ఇక ప్రభాస్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది.
బాహుబలి ప్రభంజనం అతడిని ఇప్పటికి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.దాని ఫలితమే సాహూ, రాధే శ్యామ్.
మహానటి వంటి సినిమా తీసిన తర్వాత కీర్తి సురేష్ పరిస్థితి కూడా అలాగే మారింది.దాదాపు పది సినిమాల వరకు ఏది తీసిన ఫ్లాప్.
ఈ మధ్యనే మహేష్ బాబు తో ఒక సినిమా తీసి కళావతి పాపా పట్టాలు ఎక్కింది.ఇక రిషబ్ విషయానికి వస్తే అతడికి డబల్ కష్టాలు.
అటు హీరో ఇటు దర్శకుడు.రెండు పడవల ప్రయాణం ముందు ముందు ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూడాలి.
తన తదుపరి సినిమా ప్రకటన కోసం కూడా చాల మంది ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy