ఆర్జీవి ఇప్పుడు కేసీఆర్ మీద పడ్డాడు! టైటిల్ రిలీజ్ చేసి సంచలనం

ఈ మధ్యకాలంలో దర్శకుడు ఆర్జీవి వరుసగా మళ్ళీ తన పనులతో వార్తలలో నిలుస్తున్నాడు.

తనకి తాను భాగా పబ్లిసిటీ కల్పించుకోవడంలో ఎప్పుడు ముందుండే వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూర్చి వార్తలలో ఉంటూ ఉంటాడు.

ఇక మీడియా చానల్స్ కూడా రేటింగ్స్ కోసం వర్మ చేసే ప్రతి పనిని హైలెట్ చేస్తుంది.తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమాతో తెలుగు నాట సంచలనం సృష్టించిన వర్మ ఇప్పుడు కేసీఆర్ జీవితం మీద పడ్డాడు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మాన్ని నడిపించిన విధానంని హైలెట్ చేస్తూ కథని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా కేసీఆర్ బయోపిక్ టైటిల్ లోగో విడుద‌ల చేశారు.దీనికి టైగర్ కేసీఆర్‌‌ అనే సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేసిన వర్మ దానికి ది అగ్రెసివ్‌ గాంధీ, ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ అని క్యాప్షన్‌గా పెట్టారు.

Advertisement

మరి ఈ టైగర్ కేసీఆర్ సినిమాని ఆర్జీవి ఎంత వరకు ఆవిష్కరిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement